ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

నిజాంసాగర్/బీబీపేట్/మాచారెడ్డి /ఎల్లారెడ్డి రూరల్/ సదాశివనగర్/లింగంపేట/ కామారెడ్డిటౌన్/ విద్యానగర్/ బాన్సువాడ రూరల్ : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, దళిత బహుజన ఫ్రంట్, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
కామారెడ్డి పట్టణంలోని అదనపు కోర్టు ఆవరణలో జిల్లా అదనపు జడ్జి సత్తయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ‘మనం - మన రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, పీపీ అమృత్‌రావు, సిద్ధిరాములు, న్యాయవాదులు, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి డీఎస్పీ జైపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బీబీపేట్ మండలకేంద్రంలో డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నిజాంసాగర్ మండలంలోని మగ్ధుంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ సాయిబాబా ఆధ్వర్యంలో, సఫ్దల్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కనీరాం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అనంతరం రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. లింగంపేట మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎస్వో వాసంతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట్ స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహ, సదాశివనగర్ ఇన్స్పెక్టర్ జి.వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్‌లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులు
- అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
- కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
- ఫాలో అయిపోండి..లేకపోతే వీరబాదుడే