గురువారం 04 మార్చి 2021
Kamareddy - Nov 25, 2020 , 00:40:53

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మనోళ్లు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మనోళ్లు

ఇందల్వాయి/ఎల్లారెడ్డి / మద్నూర్‌/నిజాంసాగర్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ తరఫున తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంగళవారం 128వ డివిజన్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో ఇందల్వాయి సొసైటీ చైర్మన్‌ చిం తలపల్లి గోవర్ధన్‌రెడ్డి, మండల సర్పంచులు తేలు విజయ్‌కుమార్‌, నరేశ్‌, సత్యనారాయణ ఉన్నారు.   కూ కట్‌ పల్లి డివిజన్‌లోని పాపిరెడ్డి నగర్‌లో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏగుల నర్సింహులు, సీనియర్‌ నాయకులు జలంధర్‌ రెడ్డి, ఎరుకల సాయిలు  ఉన్నారు.   130వ డివిజన్‌లోని సు భాష్‌నగర్‌ పరిధిలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి హేమలతరెడ్డి తరఫున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.  టీఆర్‌ఎస్‌ పార్టీకి  ఓటువేసి గ్రేటర్‌ పరిధిలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలను  కోరారు.  అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో ఎమ్మెల్యే వెంట జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు,  టీఆర్‌ఎస్‌ మద్నూర్‌ మం డల అధ్యక్షుడు సంగమేశ్వర్‌, సొసైటీ చైర్మన్‌ శ్రీనుపటేల్‌, సర్పంచులు దరాస్‌ సూర్యకాంత్‌, ఎంకే పటేల్‌, వైస్‌ ఎంపీపీ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ దీన్‌దయాళ్‌ ఉన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo