ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Kamareddy - Nov 24, 2020 , 01:00:34

ఘనంగా శ్రీ సత్యసాయి బాబా జయంతి

ఘనంగా శ్రీ సత్యసాయి బాబా జయంతి

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని అయ్యప్పనగర్‌లో ఉన్న శ్రీ సత్య సాయిబాబా ఆలయంలో సత్యసాయి బాబా 95వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, క్యాండిల్‌ ర్యాలీ, కేక్‌ కటింగ్‌, భజన, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గాయత్రీ హోమం, వేద పారాయణం, ఝూలా, భజన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు పండ్లు, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌: బిచ్కుంద మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బాబా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పోశెట్టి, బాల్‌రాజ్‌, సురేశ్‌, సాయికృష్ణ, గణేశ్‌, వీరభద్రయ్య, నారాయణ పాల్గొన్నారు.


VIDEOS

logo