శనివారం 28 నవంబర్ 2020
Kamareddy - Nov 22, 2020 , 02:37:25

కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాల ఆవిష్కరణ

బాన్సువాడ : అయ్యప్ప మాలను ధరించేందుకు శుభఘడియల వివరాలతో కూడిన కరపత్రాలను గురుస్వాములు పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించిన వారు కొవిడ్‌ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. అనంతరం మాలధారణ విధానం, దీక్ష పద్ధతులు, శబరిమలై యాత్ర తదితర అంశాలను వివరించారు. డిసెంబర్‌7న అయ్యప్ప ఆలయంలో శివపార్వతుల కల్యాణం, 9న ఆరట్టు మహోత్సవం, 20న సుబ్రహ్మణ్య స్వామి షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం, 21న పట్టణంలోని సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం, 26న సామూహిక మండల పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిండ్ల రాజు వివరించారు. కార్యక్రమంలో గురుస్వామి జపాల భాస్కర్‌ శర్మ,  చంద్రశేఖర్‌, పాండురంగ శర్మ, గురు వినయ్‌కుమార్‌, విఠల్‌ రెడ్డి, పురుషోత్తం శర్మ, బెజుగం శంకర్‌, ఆలయ మేనేజర్‌ విద్యాసాయిలు, ధనగారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.