శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Nov 21, 2020 , 02:46:49

సహకార ముగింపు వారోత్సవాలు

సహకార ముగింపు వారోత్సవాలు

ఎల్లారెడ్డి రూరల్‌ : సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జిల్లాలోని పలు సొసైటీల్లో శుక్రవారం నిర్వహించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ ఏగుల నర్సింహులు మాట్లాడారు. ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని 13 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2వేల 619మంది రైతుల నుంచి 72వేల 420 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

13 కోట్ల 67లక్షల 29వేల 715 రూపాయలకు గాను 9 కోట్ల 43లక్షల 54వేల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని వివరించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ మత్తమాల ప్రశాంత్‌గౌడ్‌, డైరెక్టర్లు నాగం గోపి, మర్రి సూర్యప్రకాశ్‌, పార్తి నారాయణ, బాలరాజు, లక్ష్మణ్‌, పోచవ్వ, సత్తెవ్వ, సొసైటీ సీఈవో విశ్వనాథం, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.