శనివారం 06 మార్చి 2021
Kamareddy - Nov 20, 2020 , 00:55:36

నేడు కామారెడ్డిలో జాబ్‌మేళా

నేడు కామారెడ్డిలో జాబ్‌మేళా

విద్యానగర్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో శుక్రవారం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌ కంపెనీలో ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్‌ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాను సాందీపని డిగ్రీ కళాశాల, డీఆర్డీఏ -కామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019-2020 సంవత్సరంలో బీఎస్సీ కెమిస్ట్రీ చదివి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు 60 శాతం మార్కులు కలిగిన పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు సాందీపని డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ప్రారంభమవుతుందని, అర్హులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు. మరిన్నివివరాలకు 8919087069 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


VIDEOS

logo