Kamareddy
- Nov 19, 2020 , 01:30:09
VIDEOS
పారిశుద్ధ్య పనుల పరిశీలన

ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలన్నారు. ప్రతి వీధిని శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికను పరిశీలించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING