సోమవారం 08 మార్చి 2021
Kamareddy - Nov 19, 2020 , 01:22:58

జోనల్‌స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జోనల్‌స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

22న జోనల్‌స్థాయి క్రీడాపోటీలు

జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో..

విద్యానగర్‌ : జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విస్‌డమ్‌ లీగ్‌ జోనల్‌స్థాయి క్రీడలను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు విస్‌డమ్‌ లీగ్‌ క్రీడల జిల్లా కో-ఆర్డినేటర్‌ ఆకుల బాబు తెలిపారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. ఇందులో భాగంగా క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం నిర్వహించారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల హైస్కూల్‌ విద్యార్థులు ఎంపిక పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విస్‌డమ్‌ లీగ్‌ క్రీడల జిల్లా కోఆర్డినేటర్‌ ఆకుల బాబు మాట్లాడుతూ.. అథ్లెటిక్స్‌, లిటరిటీ, కల్చరల్‌ ఈవెంట్స్‌లో సుమారు 600 మంది పాల్గొనగా.. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన 40 మందిని ఎంపిక చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22వ తేదీన నిర్వహించే జోనల్‌ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వనితా రామ్మోహన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు సాయిలు, శ్రీనివాస్‌, అశోక్‌, మహేశ్‌, రసూల్‌, స్వామిగౌడ్‌, ఉషా, నరేందర్‌, బాలయ్య, బాబురావు, లింగం, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo