ఆదివారం 17 జనవరి 2021
Kamareddy - Nov 14, 2020 , 01:07:47

వడ్డీపై 90 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి

వడ్డీపై 90 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌

విద్యానగర్‌ : ఈనెల 15వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీపై 90 శాతం మాఫీ వర్తిస్తుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో సిబ్బందితో కలిసి శుక్రవారం ఆస్తి పన్నును వసూలు చేశారు. ఆయన వెంట ఆర్‌ఐ జానయ్య, మున్సిపల్‌ అధికారి రవి తదితరులు ఉన్నారు.