శనివారం 16 జనవరి 2021
Kamareddy - Nov 14, 2020 , 01:07:45

కేసీఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతి

కేసీఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతి

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేసీఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర సెక్రటరీ నీలం రమేశ్‌ మాట్లాడుతూ.. జీవితాంతం ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ భాష, యాస కోసం కాళోజీ పోరాడారని అన్నారు. కార్యక్రమంలో కేసీఆర్‌ సేవాదళ్‌ నాయకులు రాజేందర్‌, ప్రవీణ్‌, శ్రావణ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, శంకర్‌, రామస్వామి పాల్గొన్నారు.