బుధవారం 25 నవంబర్ 2020
Kamareddy - Nov 01, 2020 , 00:55:07

ఘనంగా వల్లభాయ్‌ పటేల్‌ జయంతి

ఘనంగా వల్లభాయ్‌ పటేల్‌ జయంతి

నమస్తే తెలంగాణ యంత్రాంగం : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 145వ జయంతిని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దివస్‌ను నిర్వహించారు. పటేల్‌ చూపిన బాటలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.

బిచ్కుంద మండల కేంద్రంలో పటేల్‌ చిత్రపటానికి జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. గాంధారి ఎంపీడీవో కార్యాలయంలో  ఎంపీపీ రాధాబలరాం, పిట్లంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నిజాంసాగర్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సత్యనారాయణ, జిల్లా కేంద్రంలో బీజేపీ, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ, తపస్‌ నాయకుల ఆధ్వర్యంలో, నాగిరెడ్డిపేట్‌లోని మండల పరిషత్‌ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాల్లో ఎంపీపీ రాజదాస్‌, తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌, రామారెడ్డిలో జడ్పీటీసీ నారెడ్డి మోహన్‌రెడ్డి, లింగంపేట్‌లో ఎంపీపీ గరీబున్నీసాబేగం, ఎల్లారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ స్వామి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాధవీగౌడ్‌, బానువాడ మండలంలోని బోర్లం, సోమేశ్వర్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.