శనివారం 16 జనవరి 2021
Kamareddy - Oct 31, 2020 , 00:33:43

మిత్రుడి కుటుంబానికి అండగా..

మిత్రుడి కుటుంబానికి అండగా..

రామారెడ్డి: మండల కేంద్రానికి చెందిన బిట్ల నర్సింహులు అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం మృతిచెందాడు. అతడి భార్య సావిత్రి జూలై నెలలో అనారోగ్యంతో మరణించింది. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు నిశిత, లిఖిత అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న నర్సింహులు మిత్రులు వారికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలువాలని నిర్ణయించుకున్నారు. రామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు తమకు తోచిన విధంగా డబ్బులను పోగుచేశారు. మొత్తం 82 వేల రూపాయలను జమ చేసి ఇద్దరు పిల్లల పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఇందుకు సంబంధించి బాండ్‌ను శుక్రవారం అందజేశారు. బాలికల చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని సునందారాణి భరోసా ఇచ్చారు. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా హార్టికల్చర్‌ పీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిత్రుడి ఆత్మకు శాంతిచేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో అడ్డగుల్ల శ్రీనివాస్‌, అబ్బ లింగం, తోకల రమేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, హరికిషన్‌, రవిగౌడ్‌, కుమార్‌, సునంద, మమత, భాగ్యమ్మ, శివలక్ష్మి, మంద కవిత పాల్గొన్నారు.