గురువారం 03 డిసెంబర్ 2020
Kamareddy - Oct 31, 2020 , 00:33:41

మక్కజొన్న వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

మక్కజొన్న వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారిణి సునీత

పలు గ్రామాల్లో మక్కజొన్న పంట వివరాల సేకరణ 

సదాశివనగర్‌ : జిల్లాలో మక్కజొన్న పంటలు వేసిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారిణి సునీత అన్నారు. సదాశివనగర్‌ మండలంలోని భూంపల్లి, లింగంపల్లి, మోడెగామ, తిమ్మోజివాడి, వజ్జపల్లి, తుక్కోజివాడి, జనగామ, కల్వరాల్‌, దగ్గి, పద్మాజివాడి, మల్లుపేట్‌, సదాశివనగర్‌, మర్కల్‌, తిర్మన్‌పల్లి, ధర్మారావుపేట్‌ గ్రామాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. మక్కజొన్న పంటలు సాగుచేస్తున్న రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మక్కజొన్న సాగుచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మక్క జూడు వివరాలను వ్యవసాయాధికారులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏఈవోలు శిరీష, హారిక, స్నేహలత, కవిత, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ నాయక్‌  ఉన్నారు. 

లింగంపేట(తాడ్వాయి): తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్‌ గ్రామంలో మక్కజొన్న పంటను జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారిణి సునీత పరిశీలించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కజొన్నను కొనుగోలు చేస్తామని తెలిపారు. పంట దిగుబడిపై రైతులతో చర్చించారు. ఆమె వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్‌, ఎంపీటీసీ జలంధర్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ బాలాజీ, రైతులు ఉన్నారు.

బాన్సువాడ రూరల్‌ : మండలంలోని కాద్లాపూర్‌లో మక్కజొన్న పంటలు పండించిన రైతుల వివరాలు, దిగుబడి అంచనా వివరాలను మండల వ్యవసాయాధికారి నర్సయ్య  ఏఈవోలతో కలిసి సేకరించారు. వానకాలంలో రైతులు పండించిన మక్కజొన్న పంటను ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన  చెందవద్దని అన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ భాస్కర్‌, ఏఈవో మీనా, రైతులు ఉన్నారు.