గురువారం 03 డిసెంబర్ 2020
Kamareddy - Oct 29, 2020 , 00:43:51

పల్లెప్రగతి పనుల పరిశీలన

పల్లెప్రగతి పనుల పరిశీలన

ఎల్లారెడ్డి / గాంధారి : గాంధారి మండలంలోని చద్మల్‌ తండాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీడీవో సతీశ్‌ బుధవారం పరిశీలించారు. తండాలోని మంకీఫుడ్‌ కోర్టుతో పాటు డంపింగ్‌ యార్డు, కంపోస్ట్‌ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంకీఫుడ్‌ కోర్టులో నాటిన మొక్కలను సంరక్షించాలని, చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన వెంట ఏపీఎం గంగరాజు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సంతోష్‌ ఉన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనం పనులను ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యం పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు రాము, నీల కంఠం ఉన్నారు.