గురువారం 03 డిసెంబర్ 2020
Kamareddy - Oct 29, 2020 , 00:43:51

సీసీరోడ్డు ప్రారంభం

సీసీరోడ్డు ప్రారంభం

కామారెడ్డి/కామారెడ్డిటౌన్‌/మాచారెడ్డి/బీబీపేట్‌: మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేటలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ బుధవారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. విప్‌ వెంట ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు ఉన్నారు.  

విప్‌ గంపకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ను పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం కామారెడ్డికి రావడంతో ఆయనను పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కలిశారు. కార్యక్రమంలో మామిండ్ల అంజయ్య, నిమ్మ మోహన్‌రెడ్డి, హరికిషన్‌గౌడ్‌, గొట్టిముక్కుల నారాగౌడ్‌, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, నల్లవెల్లి అశోక్‌, మిన్కూరి రాంరెడ్డి, వజ్జపల్లి ఆంజనేయులు, పిప్పిరి ఆంజనేయులు, అదనపు పీపీ, ఏజీపీలు నంద రమేశ్‌, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..

సీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. కామారెడ్డి పట్టణంలో ఆయన భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి, మామిండ్ల అంజయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

కామారెడ్డి మండలం లింగాయపల్లికి చెందిన బోరెడ్డి బాలవ్వకు, బీబీపేట్‌కు చెందిన కుర్ల హర్షిత్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. వీటిని బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్‌ అందజేశారు. హర్షిత్‌కు రూ.11,500, బోరెడ్డి బాలవ్వకు రూ. 96 వేలు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం బీబీపేటలోని కస్తూర్బా, బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ నెల 30న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రానున్న నేపథ్యంలో పాఠశాలలను పరిశీలించినట్లు విప్‌ తెలిపారు.