శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Oct 28, 2020 , 00:37:19

వైభవంగా పుట్టఎల్లమ్మ ఉత్సవాలు

వైభవంగా పుట్టఎల్లమ్మ ఉత్సవాలు

సదాశివనగర్‌: మండల కేంద్రంలో పుట్టఎల్ల మ్మ ఉత్సవాలను గౌడ సంఘం, వీడీసీ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. గౌడ సంఘం ప్రతినిధులు ఉదయం తమ ఇండ్ల ల్లో నుంచి  బోనాలు, పుట్ట ఎల్లమ్మ విగ్రహం, గడ, పావనంను డప్పువాయిద్యాల మధ్య ఆల యం వరకు ఊరేగించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం నుంచి బోనాలను ఇండ్లకు సాయంత్రం తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జనగామ రాజు, సర్పంచ్‌ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, వీడీసీ కార్యదర్శి మహేందర్‌, క్యాషియర్‌ ఎల్లయ్య, తక్కల భాస్కర్‌రెడ్డి, బద్దం రాజిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కుమ్మరి రాజు, ఆలయ కమిటీ చైర్మన్‌ సుతారి గంగారాజం, కార్యదర్శి వంగిటి సంతోష్‌రెడ్డి, హోటల్‌ మోహన్‌రాజ్‌, మంగోళ్ల రాజు, గాదారి నర్సారెడ్డి, మ్యాదరి నర్సింహులు, గౌడ సంఘం ప్రతినిధులు సుభాష్‌గౌడ్‌, కృష్ణాగౌడ్‌, సాయాగౌడ్‌, నారాగౌడ్‌, భూమాగౌడ్‌, రాజాసాగర్‌గౌడ్‌, మణికంఠ గౌడ్‌, విష్ణువర్ధ్దన్‌ గౌడ్‌, గోవర్ధన్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, సాయి నిఖిల్‌గౌడ్‌, మోహన్‌గౌడ్‌ పాల్గొన్నారు.  

మైసమ్మ ఆలయాల్లో పూజలు

బీర్కూర్‌/నస్రుల్లాబాద్‌:  బీర్కూర్‌ మండల కేంద్రంలోని కొటారి మైసమ్మ, నస్రుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామశివారులో వెలిసిన మైసమ్మ ఆలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కొటారి మైసమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు.