గురువారం 28 జనవరి 2021
Kamareddy - Oct 28, 2020 , 00:37:17

యాసంగి పనులు షురూ

యాసంగి పనులు షురూ

కామారెడ్డి జిల్లాలో యాసంగి సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే ట్రాక్టర్ల  సహాయంతో పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు గాంధారి మండలంలో నల్ల రేగడి భూములు పూర్తిగా తడిసి యాసంగి పంటలు సాగు చేయడానికి అనుకూలంగా మారాయి. మండల కేంద్రంతో పాటు పొతంగల్‌ కలాన్‌, పొతంగల్‌ కుర్దు, తిప్పారం, నాగ్లూర్‌, బూర్గుల్‌, బొప్పాజివాడి, మాధవపల్లి, గుడిమెట్‌ తదితర గ్రామాల్లో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రైతులు వానకాలంలో సాగు చేసిన మక్కజొన్న, సోయా పంటలు కోతలు కోయగా, రెండో పంటగా (యాసంగి) శనగ, జొన్న, ధనియాలు, ఆవ పంటల ను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

- గాంధారి


logo