శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Oct 25, 2020 , 00:55:18

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

గాంధారి / సదాశివనగర్‌ రూరల్‌/ సదాశివనగర్‌/ విద్యానగర్‌ : వానకాలం సీజన్‌లో సాగుచేసిన మక్కజొన్న పంటను క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో రైతులు టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. 

గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్‌, ఎంపీపీ రాధాబలరాం, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్‌, గాంధారి విండో డైరెక్టర్లు తాడ్వాయి సంతోష్‌, దొల్లు సాయిలు, కాలభైరవ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్‌ బెజుగం సంతోష్‌, ఉప సర్పంచ్‌ రమేశ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ ముస్తఫా, కమ్మరి సాయిలు, నితిన్‌రావు, హేమ్లానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

సదాశివనగర్‌ మండలంలోని ఉత్తునూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మీపతి, సింగిల్‌విండో చైర్మన్‌ కాట్మండి ప్రభాకర్‌రావు, బీఎంసీయూ ఉపాధ్యక్షులు దొడ్లే నరేందర్‌రావు, సాయిలు, ఉపసర్పంచ్‌ శివపటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌నాయక్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ కో- ఆప్షన్‌ సభ్యుడు మోహినుద్దీన్‌, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, కలాలీ సాయాగౌడ్‌, భూంరెడ్డి, రమేశ్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌, సురేందర్‌ నాయక్‌, రమేశ్‌రావు, సదాశివరెడ్డి, బడాల భాస్కర్‌ రెడ్డి, రాజలింగం, మోడెగామ ఉప సర్పంచ్‌ రాజు, ఎల్పీ రాజిరెడ్డి, ఎడ్ల నర్సింహులు, పైడి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ పట్టణ యువజన విభాగం, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు భానుప్రసాద్‌, మండల అధ్యక్షుడు నితీశ్‌రెడ్డి, నాయకులు సతీశ్‌, చరణ్‌, నరేశ్‌, శ్రీనివాస్‌, పృథ్వీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.