శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Oct 25, 2020 , 00:55:18

ఎంపీ బీబీపాటిల్‌ త్వరగా కోలుకోవాలని పూజలు

ఎంపీ బీబీపాటిల్‌ త్వరగా కోలుకోవాలని పూజలు

గాంధారి/నాగిరెడ్డిపేట్‌/సదాశివనగర్‌/లింగంపేట: జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ వివిధ మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలోని ముదెల్లి గ్రామ హనుమాన్‌ ఆలయంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ప్రత్యేకపూజలు చేశారు. ఎంపీపీ రాధాబలరాం నాయక్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మాగౌడ్‌, ముదెల్లి విండో డైరెక్టర్‌ ప్రసాద్‌రావు, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్‌ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పూజలు చేశారు. ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్‌ నర్సింహులు, ఆత్మకూర్‌, మాల్తుమ్మెద ఎంపీటీసీలు శ్రీనివాస్‌, నారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సిద్ధయ్య, ప్రధానకార్యదర్శి యాదగిరి, మాజీ సర్పంచ్‌ విఠల్‌ పాల్గొన్నారు. సదాశివనగర్‌ మండలంలోని మల్లన్న గుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్‌ ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌ నాయక్‌, రాజేశ్వర్‌ రావు, సాయాగౌడ్‌, మర్రి సదాశివరెడ్డి, గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కమలాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో ఉన్న శివాలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుల్గం సాయిరెడ్డి, ఎంపీపీ కౌడి రవి తదితరులు పాల్గొన్నారు.