శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Oct 25, 2020 , 00:55:15

మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు

మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు

జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని శనివారం మహిషాసురమర్దిని రూపంలో అలంకరించారు. దుర్గామాత మండపాల వద్ద భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం నిర్వహించిన దీపారాధన, కుంకుమార్చన కార్యక్రమాలకు యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. పలు మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు. 

పిట్లం : మండలంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీదేవి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జగదీశ్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గామాత రూపంలో అలంకరించారు. 

నిజాంసాగర్‌: మండల కేంద్రంలోని దుర్గామాత మండపం వద్ద దీపారాధన, మాగి, గోర్గల్‌ మండపాల వద్ద కుంకుమపూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నర్సింగ్‌రావుపల్లిలోని దుర్గామాత మండపం వద్ద దీపారాధన నిర్వహించారు. గోర్గల్‌లో ఎంపీపీ పట్లోల ్లజ్యోతిదుర్గారెడ్డి, నిజాంసాగర్‌లో సర్పంచ్‌ ఉమ, ఎంపీటీసీ సభ్యురాలు రీనారాణి పూజలు నిర్వహించారు. 

గాంధారి : మండలకేంద్రంలోని దుర్గామాత మండపం వద్ద జడ్పీటీసీ శంకర్‌నాయక్‌  ప్రత్యేక పూజలు చేశారు. 

బాన్సువాడ : పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలోఅలంకరించారు. 

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని శారదాదేవి ఆలయంలో, ఎన్జీవోస్‌ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయంలో, పెద్దమ్మ ఆలయంలో అర్చకులు హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.