మంగళవారం 01 డిసెంబర్ 2020
Kamareddy - Oct 25, 2020 , 00:55:15

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌

లింగంపేట: మండలంలోని ఐలాపూర్‌ గ్రామ చెరువుకట్టపై ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల బతుకమ్మ విగ్రహాన్ని కలెక్టర్‌ శరత్‌ శనివారం ఆవిష్కరించారు. కలెక్టర్‌ను గ్రామ యువకులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్‌, సర్పంచ్‌ తుమ్మలపల్లి ధనలక్ష్మి, ఎంపీపీ గరీబున్నీసా బేగం, జడ్పీటీసీ ఏలేటి శ్రీలత, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్‌ నారాయణ, పంచాయతీ కార్యదర్శి ఫరీదాబేగం, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.