గురువారం 03 డిసెంబర్ 2020
Kamareddy - Oct 25, 2020 , 00:55:13

పులకించేలా.. పూల పండుగ..

పులకించేలా.. పూల పండుగ..

నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకను మహిళలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మను రంగు రంగుల పూలతో అందంగా పేర్చి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి చప్పట్లు, కోలాటాలతో ఆడిపాడారు. కరోనా నేపథ్యంలో పలు చోట్ల మహిళలు మాస్కులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్ల మధ్య బతుకమ్మలను ఊరేగించి చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. అనంతరం చెరువులు, కాలువల వద్ద భోజనాలను చేశారు. మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.