హైదరాబాద్ : యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ప్రొగ్రామ్స్, డిప్లొమా కోర్స్ ఇన్ ఇంగ్లీష్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఓయూ ఇటీవల వివిధ కార్యక్రమాలలో ప్రవేశానికి విదేశీ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అన్ని యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను https://www.oufro.ac.in/ వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30. కాగా పీహెచ్డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు ఏడాది పొడవునా అంగీకరించబడతాయని పేర్కొంది. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు director.ufro@gmail.com కు మెయిల్ చేయవచ్చు లేదా 040-27096187 / 040-27682282 లో సంప్రదించవచ్చని వర్సిటీ వెల్లడించింది.