శనివారం 28 నవంబర్ 2020
Kamareddy - Oct 24, 2020 , 01:11:45

ర్యాపిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలి

ర్యాపిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలి

కలెక్టర్‌ శరత్‌

విద్యానగర్‌ / కామారెడ్డి టౌన్‌ : కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా కట్టడికి కృషిచేసిన వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేలా చూడాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిసిన వారికి తప్పనిసరిగా కొవిడ్‌ నిర్ధారణ టెస్టులు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా ఐసీడీఎస్‌ అధికారిణి అనురాధ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచాలి  

జాతీయ రహదారి నంబర్‌ 161 పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిట్లం, బిచ్కుంద మండలాలకు చెందిన 12 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైవే రోడ్డు ఎత్తుగా ఉండడం ద్వారా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అటవీ, ట్రాన్స్‌కో, నేషనల్‌ హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి. యాదిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ సోమయ్య, ట్రాన్స్‌కో ఈఈ శేషారావు, నేషనల్‌ హైవే, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.