శనివారం 05 డిసెంబర్ 2020
Kamareddy - Oct 21, 2020 , 01:17:46

ప్రయాణికులకు చేరువయ్యేందుకు కృషి

ప్రయాణికులకు చేరువయ్యేందుకు కృషి

బీర్కూర్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని బీర్కూర్‌, బిచ్కుంద బస్టాండుల్లో ఆర్డీసీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తూ ప్రయాణికులకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామని డీవీఎం గణపతిరాజు అన్నారు. బీర్కూర్‌లోని పెట్రోల్‌ బంకులో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన డ్రా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకులు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. 

బాన్సువాడ ఆర్టీసీ డీఎం సాయన్న, ఏడీఎం ఆంజనేయులు, సిబ్బంది సాయిలు, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.