మంగళవారం 27 అక్టోబర్ 2020
Kamareddy - Oct 19, 2020 , 01:47:42

భక్తిశ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రోత్సవాలు

భక్తిశ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రోత్సవాలు

రెండో రోజూ కొనసాగిన ప్రత్యేక పూజలు

విద్యానగర్‌ /నిజాంసాగర్‌/ ఎల్లారెడ్డి/సదాశివనగర్‌/      బీర్కూర్‌ / పిట్లం / మద్నూర్‌/గాంధారి : జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉన్న శారదాదేవి ఆలయంలో అర్చకులు గంగవరపు ఆంజనేయ శర్మ, సతీశ్‌ పాండే, ఎన్జీవోస్‌ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయంలో శ్రావణ్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో, శ్రీ సంకష్ఠహర మహాగణపతి ఆలయంలో సంపత్‌ శర్మ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం వద్ద కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా దోమకొండ మండలకేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సర్పంచ్‌ అంజలి, ప్రజాప్రతినిధులు ఆలయంలో ఆదివారం పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోహన్‌రెడ్డి, శేఖర్‌ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి పట్టణంలోని ముదిరాజ్‌ సంఘంలో, పన్నాలాల్‌ కాలనీలో, పోచమ్మ ఆలయంలో చైతన్య యూత్‌ ఆధ్వర్యంలో, నయాబాది కాలనీలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాల వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు. సదాశివనగర్‌ మండలకేంద్రంలో అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద రాత్రి భజనలు, పాటల పోటీలు నిర్వహించారు. 

గాంధారి, బీర్కూర్‌ మండలకేంద్రాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలను బాలాత్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరించారు. పిట్లం మండలకేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో హన్మాండ్లుచారి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పిట్లంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. logo