శుక్రవారం 23 అక్టోబర్ 2020
Kamareddy - Oct 18, 2020 , 01:49:49

రైతువేదికలను నందనవనాలుగా తీర్చిదిద్దాలి

రైతువేదికలను నందనవనాలుగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌: రైతు వేదిక భవనాలను నందన వనాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు.  కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో శనివారం ఇంజినీరింగ్‌, విద్యుత్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు వేదిక భవనాల చుట్టూ మూడు వరుసల్లో మొక్కలను పెంచాలని సూచించారు. జిల్లాలో 104 రైతు వేదిక భవనాలను సకాలంలో పూర్తి చేసినందుకు ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. అన్ని రైతు వేదికలకు విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo