సోమవారం 25 జనవరి 2021
Kamareddy - Oct 15, 2020 , 02:00:35

గడీకోట ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయం

గడీకోట ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయం

  • విప్‌ గంప గోవర్ధన్‌

దోమకొండ : గడీకోట ట్రస్ట్‌ నిర్వాహకుడు కామినేని అనిల్‌, శోభన గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో నిర్మించిన మెట్రో టాయిలెట్స్‌, వైకుంఠరథం, కోటలోని ఆనంద్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అపోలో టెలీ ఫార్మసీని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. గడీకోట ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో మెట్రో టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టి స్వచ్ఛ గ్రామం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. అపోలో టెలీ ఫార్మసీ ద్వారా తక్కువ ధరకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. కామినేని అనిల్‌- శోభన మాట్లాడుతూ.. దేశంలోని గ్రామీ ణ ప్రాంతాల్లో 10 వేల అపోలో టెలీ ఫార్మసీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా దోమకొండలో మొదటి టెలీ ఫార్మసీని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం విప్‌ గంప గోవర్ధన్‌ను కామినేని అనిల్‌, శోభ, ప్రజాప్రతినిధులు సన్మానించారు.  జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, ఎంపీపీలు కోట సదానంద, బాలమణి, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, రైతుబంధు సమితి కన్వీనర్‌ నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు అంజలి, సూర్యప్రకాశ్‌, ఎంపీటీసీలు రమేశ్‌, శారద, శంకర్‌, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.logo