పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కవిత

బోధన్ / కామారెడ్డి : ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. బోధన్, కామారెడ్డిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని విప్ గంప గోవర్ధన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలను పరిచయం చేసుకున్నారు. కవిత వెంట మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, వైస్ చైర్మన్ నరేశ్, కామారెడ్డి జడ్పీటీసీ రమాదేవి ఉన్నారు. మధ్యాహ్నం ఎంపీ బీబీ పాటిల్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌తో కలిసి పట్టణంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే షకీల్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణానికి వచ్చిన కవితకు ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు పటాకులు కాల్చి, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. కవిత వెంట బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, వైస్ చైర్మన్ ఎహెతేషాం, టీఆర్ఎస్ బోధన్ నియోజకర్గ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బుద్దె రాజేశ్వర్, ఎంఏ రజాక్, జాడె సతీశ్, పి.గంగాధర్‌గౌడ్, సంజీవ్‌కుమార్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!