సోమవారం 30 నవంబర్ 2020
Kamareddy - Oct 06, 2020 , 01:45:02

సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా

సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా

కామారెడ్డి : ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భాగంగా సోషల్‌ మీడియాపై నిఘా కోసం  పోలీసు సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని,  నిబంధనలను ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 22 పోలింగ్‌ కేంద్రాల వివరాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించే వారు నియోజకవర్గ స్థాయిలో ఓటరుగా నమోదు అయి ఉండాలని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.   సమావేశాలకు, వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని  సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా శానిటైజేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తామని, ఓటర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి ఓటింగ్‌లో పాల్గొనాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌ పి. యాదిరెడ్డి, ఆర్వో శ్రీనునాయక్‌, సీపీవో శ్రీనివాస్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీ నుంచి ఖాసీం అలీ, టీఆర్‌ఎస్‌ నుంచి కుంబాల రవి, బీజేపీ నుంచి  నరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి బాలరాజు, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.