బుధవారం 28 అక్టోబర్ 2020
Kamareddy - Sep 29, 2020 , 02:10:41

నిండుగా పారుతున్న గోదావరి

నిండుగా పారుతున్న గోదావరి

రెంజల్‌: మండలంలోని కందకుర్తి గోదావరినదిలో వరద  ఉధృతంగా ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండిపోయాయి. అక్కడి ప్రాజెక్టు గేట్లను తెరవడంతో గోదావరినదిలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో కందకుర్తి వద్ద వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తున్నది. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ధర్మాబాద్‌ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న వీఐపీ పుష్కర ఘాట్‌కు వెళ్లే మార్గంలో నీరు నిండుగా పారుతుండడంతో రెండు రోజులుగా రాక పోకలు నిలిచిపోయాయి. నది పక్కనే సాగు చేస్తున్న సోయా పంటలోకి వరదనీరు చేరడంతో చేతికి వచ్చిన పంట నీట మునిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జాలర్లు చేపల వేటకు, భక్తులు స్నానాలు ఆచరించేందుకు నదిలోకి వెళ్లవద్దని రెంజల్‌ ఎస్సై  రాఘవేందర్‌ సూచించారు.


logo