మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో యువహీరో నాగచైతన్య ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్లో విశేషప్రజాదరణ పొందిన ‘ఫారెస్ట్ గంప్’ (1994) చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో కశ్మీర్‌లోని కార్గిల్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 45రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కార్గిల్ నేపథ్య యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో నాగచైతన్య పాల్గొనబోతున్నట్లు తెలిసింది. సినిమాలో కీలమైన ఈ షెడ్యూల్లో నాగచైతన్యపై ముఖ్యఘట్టాల్ని చిత్రీకరించనున్నారని సమాచారం. నాగచైతన్య నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిదే కావడం విశేషం. అద్వైత్‌చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.