మంగళవారం 20 అక్టోబర్ 2020
Kamareddy - Sep 21, 2020 , 03:40:51

చురుకుగా కొనసాగుతున్న ‘డబుల్‌' ఇండ్లు

చురుకుగా కొనసాగుతున్న ‘డబుల్‌' ఇండ్లు

బాన్సువాడ : పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సొంత ఇంటి స్థలం ఉండి ఇంటిని నిర్మించుకునే స్థోమత లేనివారికి సైతం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు మంజూరు చేశారు. దీంతో లబ్ధిదారులు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇండ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. దాసరిగల్లీ, పాత బాన్సువాడ, శాంతినగర్‌ కాలనీ, బోయవాడ, బీడీ వర్కర్స్‌ కాలనీల్లో 500కు పైగా ఇండ్లను లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మించుకుంటున్నారు. వీటితోపాటు తాడ్కోల్‌ శివారులో మరో వెయ్యి ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని హంగులు, సకల వసతులతో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సొంతింటి కల నెరవేరుతుండడంపై లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమకు ఇండ్లు మంజూరు చేయించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటామని అంటున్నారు. మొత్తం 1500లకు పైగా డబుల్‌ ఇండ్ల బెడ్‌రూమ్‌ ఇండ్ల పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.logo