మంగళవారం 20 అక్టోబర్ 2020
Kamareddy - Sep 21, 2020 , 03:32:07

నిజాంసాగర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఐదు రోజులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 1,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటి పారుదల శాఖ డీఈఈ దత్తాద్రి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1392.18 అడుగులు (5.07 టీఎంసీలు) ఉన్నట్లు తెలిపారు. నిజాంసాగర్‌ ఎగువ భాగంలో ఉన్న సింగూరు ప్రాజెక్ట్‌లోకి 6,235 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 520.650 మీటర్లు 17.051 టీఎంసీల నీరు నిలువ ఉంది. జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులో 458.00 మీటర్ల (1.237 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి 2,514 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈ రాజ్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్టు మూడు వరదగేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

‘పోచారం’లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
నాగిరెడ్డిపేట్‌ : మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం ప్రాజెక్టులోకి 1,232 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 1192 క్యూసెక్కులు మత్తడి ద్వారా కిందికి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. 


logo