మంగళవారం 20 అక్టోబర్ 2020
Kamareddy - Sep 21, 2020 , 03:25:14

మూడు ఆలయాల్లో చోరీ..

మూడు ఆలయాల్లో చోరీ..

నాగిరెడ్డిపేట్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండల కేంద్రంలోని మూడు ఆలయాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. కోదండ రామాలయం ఆవరణలో ఉన్న సీతారామాలయం, సంతోషిమా త, శివాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సీతమ్మ, సంతోషిమాత, పార్వతీదేవి విగ్రహాల మెడలో ఉ న్న పుస్తెలను అపహరించుకుపోయారు. మూడు ఆలయాల తాళాలు పగులగొట్టి 13 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. సంఘటనా స్థలానికి స్థానిక ఎస్సై రాజయ్య చేరుకొని పూజారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు జతల పుస్తెలు, ఒక ము క్కు పుడక అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే.. 

కోదండరామాలయం నుంచి పోలీసు స్టేషన్‌కు అర కిలోమీటరు దూరం కూడా ఉండదు. అంత దగ్గరలో ఉన్న ఆలయంలో దొంగతనం జరగడంతో మండల ప్రజ లు ఉలిక్కిపడ్డారు. పోలీసులు దొం గలను పట్టుకొని శిక్షించాలని  వారు కోరుతున్నారు.logo