శుక్రవారం 30 అక్టోబర్ 2020
Kamareddy - Sep 17, 2020 , 02:52:54

అవకతవకలు.. బట్టబయలు

అవకతవకలు.. బట్టబయలు

  •  కామారెడ్డి జిల్లాలోని 95 పంచాయతీల్లో  నిధుల దుర్వినియోగం

కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు  మంజూరు చేయగా కొందరు సర్పంచులు, కార్యదర్శులు కలిసి దుర్వినియోగం చేస్తున్నారు. పూర్తి చేసిన పనులకు సరైన బిల్లులు చూపించకుండా తప్పుడు రికార్డులతో సర్కారు సొమ్ముకు గండి కొట్టారు. 2018-19 సంవత్సరానికిగాను గ్రామాల్లో చేపట్టిన పనుల్లో అనేక అవకతవకలు వెలుగుచూడడం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లాలోని 95 గ్రామ పంచాయతీలో రూ. 41 లక్షల 45 వేల 51 స్వాహా చేసినట్లు ఆడిట్‌ అధికారులు బయటపెట్టారు. ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేసినట్లు జిల్లా ఆడిట్‌ అధికారిణి విజయలక్ష్మి తెలిపారు. దుర్వినియోగం చేసిన సొమ్మును వెంటనే చెల్లించాలని, లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడిట్‌ అధికారులు  తెలిపిన వివరాల ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా దుర్వినియోగమైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. 

బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామ పంచాయతీలో రూ.23,427, ఉప్పర్‌పల్లిలో రూ.11, 285, భిక్కనూరు మండలం లక్ష్మీదే దేవునిపల్లిలో రూ.65,233, లింగంపేట్‌ మండలం భవానీపేట్‌లో రూ.3,894, ముంబాజీపేట్‌లో రూ. లక్షా 99వేల 24, కొత్తపల్లిలో రూ.18,478, పెద్ద కొడప్‌గల్‌ మండలం టిక్కారంతండాలో రూ.42,786, వడ్లం గ్రామంలో రూ.4లక్షల72వేల 493, గాంధారి మండలం పెట్‌సంగెంలో రూ.4,915, మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట్‌లో రూ.48,650, రత్నగిరిలో 1,880 రూపాయలు, బాచపల్లిలో 1,900 రూపాయలు, సోమార్‌పేటలో రూ.91,630, బండరామేశ్వర్‌ గ్రామంలో రూ.2లక్షల 25,469, లచ్చపేటలో రూ.5,839, ఆరేపల్లిలో రూ.4లక్షల 67వేల 570 నిధులు దుర్వినియోగమయ్యాయి. 

కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో రూ.1028, చిన్నమల్లారెడ్డి గ్రామంలో రూ.4,256, ఇస్రోజివాడి గ్రామంలో రూ.లక్షా 12వేల 500, గర్గుల్‌లో 4,441, తాడ్వాయి మండలం బ్రాహ్మణ్‌పల్లిలో రూ.28,696, దోమకొండ మండలం ముత్యంపేటలో  రూ.33, 556, బిచ్కుంద మండలం సిర్‌సముందర్‌ గ్రామంలో రూ.11,190, వాజీద్‌నగర్‌లో రూ.91,624, దగ్గిలో రూ.8,059, రాజాపూర్‌లో రూ.63,620, పటేల్‌పూర్‌లో రూ.4,535, రాజంపేట మండలం కొందుర్తి గ్రామంలో రూ.4,512, రాజంపేటలో రూ.31,961, మద్నూర్‌ మండలం ముంజీయాలో రూ.11,843, ధోతి గ్రామంలో రూ.4,595, రాచూర్‌లో రూ.4,490, రాజేగావ్‌లో రూ.4వేల 17, గోజేగావ్‌లో రూ.2,457, సదాశివనగర్‌ మండలం లింగంపల్లిలో రూ.10, 278, అమర్లబండలో రూ.14,313, తుక్కోజివాడిలో రూ.8,646, నస్రుల్లాబాద్‌ మండలం నెమ్లిలో రూ.55,636, నస్రుల్లాబాద్‌లో రూ.4,858, నాగిరెడ్డిపేట్‌ మండలం రాఘవపల్లిలో రూ.2,220, తాండూర్‌లో రూ.10,644,  నాగిరెడ్డిపేట్‌ గ్రామంలో రూ.95,600, తాడ్వాయి మండలం నందివాడలో రూ.76వేల 328,  దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో రూ. 6 లక్షల 41,943, బాన్సువాడ మండలం కోనాపూర్‌లో రూ.76,895 నిధులు దుర్వినియోగం అయ్యాయి.

  రామారెడ్డి మండలం రెడ్డిపేటలో రూ.73,485, మద్దికుంటలో రూ.7,239, భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌లో రూ.8వేల 34,  పిట్లం మండలం చిన్న కొడప్‌గల్‌ గ్రామంలో రూ.19,691, పిట్లంలో రూ.1,504, గాంధారిలో రూ.9,747 రూపాయలు,  జుక్కల్‌ మండలం హజ్‌గారి గ్రామంలో రూ.11,030, ఎల్లారెడ్డి మండలం దేవిమర్లపల్లిలో వెయ్యి, పెద్దకొడప్‌గల్‌ మండలం బేగంపూర్‌లో రూ. లక్షా 94,809, కాసులాబాద్‌లో రూ.లక్షా 36,246, రామారెడ్డి గ్రామంలో రూ.28,635, నాగిరెడ్డిపేట్‌ మండలం మగ్ధుంపూర్‌లో రూ.22,378, బిచ్కుంద మండలం బండరెంజల్‌ గ్రామంలో రూ.2,022, తాడ్వాయి మండలం కృష్ణాజివాడీలో రూ.3వేలు, లింగంపేట్‌లో రూ.10వేలు, బిచ్కుంద మండలం శాంతాపూర్‌లో రూ.5,914, తాడ్వాయి మండలం కాళోజీ గ్రామంలో రూ.12,184, ఆర్గోండ గ్రామంలో రూ.40,300, బీర్కూలో రూ.23,299, గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌లో రూ.3013, తాడ్వాయి మండలం దేమీకలాన్‌లో రూ.2,628, మాచారెడ్డి మండలం భవనీపేట్‌లో రూ.8,248, రామారెడ్డి మండలం రాజంపేట్‌లో రూ. లక్షా 8,688, ఇసన్నపల్లిలో రూ.14,630, బట్టుతండాలో రూ.9,844 నిధులు దుర్వినియోగమైనట్లు తనిఖీల్లో వెల్లడైంది.