శనివారం 31 అక్టోబర్ 2020
Kamareddy - Sep 17, 2020 , 02:52:54

ఈజీఎస్‌ పనుల యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలి

ఈజీఎస్‌ పనుల యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలి

  • జడ్పీ సీఈవో గోవింద్‌

ఆర్మూర్‌ : ప్రతి గ్రామపంచాయతీలో ఉ పాధి హామీ పథకంపై యాక్షన్‌ ప్లాన్‌ తయా రు చేయించాలని జడ్పీ సీఈవో గోవింద్‌ తె లిపారు. ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో జడ్పీ సీఈవో బుధవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కోసం నర్సరీల ఏర్పాటుకు చ ర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హా మీ కూలీలకు జాబ్‌కార్డులను జారీ చేస్తూ కూలీలకు పని కల్పించాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ రక్షించే బాధ్యతను కార్యదర్శులు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్‌ ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో వేజన, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈజీఎస్‌ పనులపై అవగాహన 

చందూర్‌: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై డీఆర్పీ మంజుల బుధవారం అవగాహన కల్పిచారు. ఈజీఎస్‌ ద్వా రా కూలీలకు పనులను కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, సీనియర్‌ మేట్లకు ఈజీఎస్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఎంపీవో తారాచంద్‌, కార్యదర్శి సాయిలు, ఏపీవో దేవీసింగ్‌ పాల్గొన్నారు.