శుక్రవారం 30 అక్టోబర్ 2020
Kamareddy - Sep 17, 2020 , 02:53:04

ఎస్సారెస్పీ 16 గేట్ల ఎత్తివేత

ఎస్సారెస్పీ 16 గేట్ల ఎత్తివేత

  • 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

మెండోరా : జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి వదలుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటికి అనుగుణంగా గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. బుధవారం సాయం త్రం 5.30 గంటలకు ఇన్‌ఫ్లో 60,642 క్యూసెక్కులు ఉండగా, 16 వరద గేట్లతో 50 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 500, లక్ష్మీ కాలువకు 300 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతోంది. ఎస్కేప్‌ గేట్ల నుంచి 8 వేల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా 90.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి పంపుతున్నారు. బుధవారం ఎగువ నుంచి అనూహ్యంగా 2,21,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెనువెంటనే 40 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 11 గంటలకు ఇన్‌ఫ్లో 96,013 క్యూసెక్కులకు తగ్గడంతో.. 26 వరద గేట్లతో 75 వేల క్యూసెక్కులను వదిలేశారు. నీటి విడుదలను 75 వేలు కొనసాగిస్తూ రెండు వరద గేట్లను మూసివేశారు. సా యంత్రం 5.30 గంటలకు ఇన్‌ఫ్లో 60,642 క్యూసెక్కులకు తగ్గడంతో 16 వరద గేట్లతో 50 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయిలో నిండడంతో వరద కాలువకు నీటి విడుదలను మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివేశారు. 

వెనుదిరుగుతున్న పర్యాటకులు

ఎస్సారెస్పీ నిండుకుండలా మారడంతో  పర్యాటకులు పోచంపాడ్‌కు తరలివస్తున్నారు.  కరో నా నేపథ్యంలో పోలీసులు చెక్‌ పోస్టు ఏర్పా టు చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌ అందాలను తిలకించేందుకు వచ్చినవారు ని రాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో  ప్రాజెక్టు వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టు వద్ద పోలీస్‌ సిబ్బందితోపాటు పోచంపాడ్‌ యువజన సంఘాల సభ్యులు వలంటీర్లుగా పనిచేస్తున్నారు.