బుధవారం 02 డిసెంబర్ 2020
Kamareddy - Sep 12, 2020 , 03:10:37

అటవీశాఖ అమరవీరులకు నివాళి

అటవీశాఖ అమరవీరులకు నివాళి

ఇందూరు : అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా  అమరులైన ఉద్యోగులకు శుక్రవారం ఆ శాఖ అధికారులు, సిబ్బంది నివాళులు అర్పించి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. 

జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఆవరణలో  శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నిజామాబాద్‌ సర్కిల్‌ వినయ్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌ హిరామత్‌, అధికారులు శ్రీరాంకిషన్‌, భవానీశంకర్‌, పద్మారావు, భాస్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు.  

ఇందల్వాయిలో..

ఇందల్వాయి :  రేంజ్‌ అటవీశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  రేంజ్‌ అధికారి హిమచంద మాట్లాడుతూ.. అటవీ అమరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అటవీశాఖ ఉద్యోగి గంగయ్య ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్క అధికారి ముందుకెళ్లాలన్నారు. అటవీ సంపదను కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు ఫారెస్ట్‌ అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 

కార్యక్రమంలో రేంజ్‌ ఆఫీసర్‌, బీట్‌ ఆఫీసర్‌, సిబ్బంది పాల్గొన్నారు.