శుక్రవారం 30 అక్టోబర్ 2020
Kamareddy - Sep 11, 2020 , 03:05:07

రోగులకు మెరుగైన సేవలు

రోగులకు మెరుగైన సేవలు

  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి 
  • lబాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలకు ప్రకటించిన అంబులెన్సులు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ప్రారంభం

బాన్సువాడ/కమ్మర్‌పల్లి: కరోనా, ఇతర రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి  తెలిపారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయన పిలుపు మేరకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గానికి శ్రీనివాసరెడ్డి, బాల్కొండ నియోజకవర్గానికి ప్రశాంత్‌రెడ్డి సొంత ఖర్చులతో అధునాతన అంబులెన్సులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రెండు నియోజకవర్గాలకు చెందిన అంబులెన్సులను హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్‌లో గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్సుల సేవలు ఆయా నియోజకవర్గాల్లో తక్షణమే అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.