గురువారం 22 అక్టోబర్ 2020
Kamareddy - Aug 29, 2020 , 02:24:23

మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట

మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట

  • l కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ 
  • l సింగీతం రిజర్వాయర్‌లో  చేపపిల్లల విడుదల

నిజాంసాగర్‌:  రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌  దఫేదార్‌ శోభ  అన్నారు. శుక్రవారం మండలంలోని సింగీతం రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మా ట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 3.50 కోట్ల చేప పిల్లలను వంద శాతం రాయితీపై విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. చేప పిల్లలను ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో విడుదల చేయనున్నామని,  వాటితో మత్స్యకార్మికులు జీవనోపాధి పొందాలన్నారు. 

సింగీతం ప్రాజెక్టులో 1.81 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని వాటిలో బంగారు తీగ, బొచ్చ, రోహు రకం చేప పిల్లలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎంపీపీ పట్లోల్ల జ్యోతి దుర్గారెడ్డి, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, దుర్గారెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సొసైటీ చైర్మన్‌ వాజిద్‌, డీఈఈ దత్తాత్రి, మత్స్యశాఖ మండల అధికారి డోలీసింగ్‌ సర్పంచులు, నాయకులు సంగమేశ్వర్‌గౌడ్‌, కాశయ్య, మహేందర్‌, దఫేదార్‌ విజయ్‌  తదితరులు పాల్గొన్నారు. 


logo