బుధవారం 21 అక్టోబర్ 2020
Kamareddy - Aug 29, 2020 , 02:24:46

అన్నదాతకు అదనపు ఆదాయం

అన్నదాతకు  అదనపు ఆదాయం

  • పొలం గట్లపై టేకు, కొబ్బరి చెట్ల పెంపకం

చందూర్‌ : మండల రైతులు మెరుగైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రతి సంవత్సరం నాట్లు వేస్తూనే పొలం గట్లపై కొబ్బరి, టేకు మొక్కలు నాటుతూ వస్తున్నారు. ప్రస్తుతం టేకు, కొబ్బరి చెట్లు పెరిగి రైతుకు ఆదాయ వనరుగా మారాయి. కొబ్బరి చెట్లకు కాసిన బొండాలు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. అంతేకాకుండా ఎండిన కొబ్బరి ఆకులతో చీపుర్లు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. టేకు చెట్లు కలప సామగ్రికి ఉపయోగపడుతున్నాయి. టేకు కలప బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కలప విక్రయంతో ఆదాయం సమకూరుతోంది. టేకు, కొబ్బరి చెట్ల పెంపకం ఆదాయ వనరుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది.  logo