బుధవారం 30 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 15, 2020 , 03:43:17

కొవిడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ ప్రారంభం

కొవిడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ ప్రారంభం

ఇందూరు: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ మొబైల్‌  టెస్టింగ్‌  వ్యాన్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో అధిక జనాభా ఉన్నందున కొవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రజలు భయపడి జిల్లా దవాఖాన వరకు వచ్చి టెస్టులు చేయించుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్‌ వాహనం ద్వారా తిరుగుతూ కొవిడ్‌ లక్షణాలున్న ప్రతిఒక్కరికీ టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్‌ అయినవారికీ టెస్టులు చేస్తామని తెలిపారు. వైద్యారోగ్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లో టెస్టులు అవసరమున్న వారిని గుర్తించి వైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే మెడికల్‌ కిట్లు అందజేసి ఐసొలేషన్‌కు పంపించాలన్నారు. కార్యక్రమంలో నగర మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్‌ ఇన్‌చార్జి వైద్యాధికారిణి  అంజన తదితరులు పాల్గొన్నారు. 

బీమాతో కొండంత ధీమా...

రైతు అనుకోని సందర్భంలో మరణిస్తే వారి కుటుంబాలకు దారి చూపే ఉద్దేశంతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అనేక కారణాలతో అకాల మరణం చెందుతున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడమే రైతు బీమా పథకం ప్రధా న ఉద్దేశం. 2018, పంద్రాగస్టు నుంచి రైతు జీవిత బీమా అమల్లోకి రాగా నేటితో రెండేండ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. రైతుబీమా పరిధిలోకి వచ్చే వ్యక్తి ఏ కార ణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు వర్తించేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 18నుంచి 60 ఏండ్లలోపు రైతులందరికీ ఒక్కొక్కరికి ప్రభుత్వమే తొలుత 2018-2019లో రూ.2,270 ప్రీమియం చెల్లించింది. రైతులకు నయా పైసా భారం లేకుండా రూ.వంద ల కోట్లను ఎల్‌ఐసీకి చెల్లించింది. 2019-2020లో రైతుబీమా ప్రీమియాన్ని ఎల్‌ఐసీ భారీ గా పెంచింది. రూ.2,270 నుంచి రూ.3,555కు పెంచడంతో ప్రభుత్వంపై భారం పెరిగినా ప్రీమి యం చెల్లింపునకే సర్కారు మొగ్గు చూపింది. ము చ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం రెన్యువల్‌కు నోచుకోవడంతో నేటి నుంచి మరో ఏడాది వరకు బీమా కొనసాగనుంది. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిజామాబాద్‌ జిల్లాలో 2018-19లో 703 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ.34.90కోట్ల బీమా చెల్లించారు. 2019-20 సంవత్సరంలో 512 మంది వివిధ కారణాలతో చనిపోగా రూ. 22.40 కోట్లు  అందించారు. కామారెడ్డి జిల్లాలో 2018-19లో 802 మంది రైతులు మరణించగా రూ.38.40 కోట్లు చెల్లించారు. 2019-20 సంవత్సరంలో 280 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున బీమా రూ.11.35 కోట్లు చెల్లించారు.


logo