బుధవారం 30 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 12, 2020 , 02:58:19

పొంగిపొర్లుతున్న వాగులు

పొంగిపొర్లుతున్న వాగులు

  • నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటలు
  • మత్తడి దుంకుతున్న చెక్‌డ్యాంలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కోటగిరి/వేల్పూర్‌/రుద్రూర్‌/మోర్తాడ్‌/కమ్మర్‌పల్లి/ఏర్గట్ల /నిజామాబాద్‌ రూరల్‌/ఎడపల్లి (శక్కర్‌నగర్‌): జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు వాగులు, చెక్‌డ్యాం లు పొంగిపొర్లుతున్నాయి. అన్ని చెరువులు జలకళను సం తరించుకున్నాయి. కోటగిరి మండలంలోని ఎత్తొండ, కోటగిరి, కొల్లూర్‌, యాద్గార్‌పూర్‌ తదితర గ్రామాల్లోని వాగు లు పారుతున్నాయి. రెండు రోజుల పాటు వర్షం కురవడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్‌ మండలంలో కప్పల వాగు, పెద్ద వాగు, రామన్నపేట్‌, జాన్కంపేట్‌ సమీపంలో నిర్మించిన చెక్క్‌డ్యాంపై నుంచి వరద పారుతున్నది. చెక్‌డ్యాంల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రుద్రూర్‌ నుంచి బొప్పాపూర్‌ గ్రా మానికి వెళ్లే దారిలో ఉన్న వాగు నిండుగా పారుతున్నది. కమ్మర్‌పల్లిలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు 9.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మోర్తాడ్‌లోని పెద్దవాగు జలకళను సంతరించుకుంది. సోమవారం 36.4 మి.మీ, మంగళవారం 7.4 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాం నుంచి నీరు పొంగిపొర్లు తున్నది. పాలెం-ధర్మోరా గ్రామాల మధ్య చెక్‌డ్యాం ఇటీవలే పూర్తికావడంతో ఇక్కడ నీరు నిలవడం, మత్తడి పారడంతో రెండు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాంలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆకుల కొండూర్‌ చెరువు నిండి అలుగు పారుతున్నది. నీరు పుష్కలంగా ఉండడంతో పంటలకు ఢోకా లేదని కొండూర్‌ సర్పంచ్‌ మెట్టు అశోక్‌ అన్నారు. 

పాల్ద గ్రామశివారులో పలువురి పంట పొలాలు నీటమునిగాయి. గ్రామంలోని బీటీ రోడ్డు జలమయమైంది. ఎడపల్లి మండలంలోని పలు చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామ పెద్దవాగుపై ఉన్న చెక్‌డ్యాం నిండుగా పారుతుండడంతో గ్రామస్తులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.


logo