సోమవారం 28 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 12, 2020 , 02:58:20

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

  • ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ 

కామారెడ్డి: కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.  మంగళవారం ఆయన రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మికి రూ. రెం డు లక్షల బీమా చెక్కును  అందజేశారు. టీఆర్‌ఎస్‌లో సభ్యత్వం కలిగి ఉన్న లక్ష్మి భర్త ఓరుగంటి బాలరాజు విద్యుత్‌షాక్‌తో మృతి చెం దాడు. పార్టీ నుంచి బీమా కల్పించడంతో రూ. రెండు లక్షలు మంజూరు కాగా చెక్కును  అందజేశారు. విప్‌ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

బాధిత కుటుంబానికి విప్‌ పరామర్శ

కామారెడ్డిరూరల్‌ : మండలంలోని శాబ్దిపూర్‌ ఎంపీటీసీ నిమ్మ జలజ భర్త ప్రభాకర్‌రెడ్డి అకాల మరణం చెందగా, విప్‌ గంపగోవర్ధన్‌ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  


logo