సోమవారం 26 అక్టోబర్ 2020
Kamareddy - Aug 11, 2020 , 01:09:07

మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయసేవలు

మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయసేవలు

నిజామాబాద్‌ లీగల్‌ : మొబైల్‌ వర్చువల్‌ వీడియో ద్వారా న్యాయసేవలను అందిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి శ్రీసుధ తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆన్‌లైన్‌ ద్వారా మొబైల్‌ వర్చువల్‌ వీడియో ద్వారా న్యాయసేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్‌నెట్‌ సౌకర్యంలేని ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదుల సౌకర్యార్థం మొబైల్‌ వ్యాన్‌లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొబైల్‌ వ్యాన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించామని వివరించారు. మొబైల్‌ వ్యాన్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు జడ్జిలు గౌతంప్రసాద్‌, నర్సింహారెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మహి, న్యాయవాదులు శ్రీధర్‌, కిరణ్‌కుమార్‌గౌడ్‌, మాణిక్‌రాజ్‌ , ఆశ నారాయణ, సుఫల, శ్రీనివాస్‌, రాము, పురుషోత్తం గౌడ్‌ పాల్గొన్నారు.logo