బుధవారం 28 అక్టోబర్ 2020
Kamareddy - Aug 09, 2020 , 02:10:14

కరోనాను జయించి..

కరోనాను జయించి..

  • lఎల్లారెడ్డిలో విధుల్లో చేరిన పోలీసు సిబ్బంది
  • lపూలు చల్లి స్వాగతం పలికిన సీఐ రాజశేఖర్‌
  • lసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన   

ఎల్లారెడ్డి : కరోనా వైరస్‌ను జయించినప్పటికీ విధు ల్లో అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్‌ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్‌ సోకడంతో హోం ఐసొలోషన్‌ పూర్తి చేసుకుని శనివారం విధుల్లో చేరారు. వారికి సీఐ పూలు చల్లి స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజలు కొవిడ్‌-19 బారిన పడకుండా నిత్యం వా రితో కలిసి పని చేయాల్సి ఉంటుందన్నా రు.  ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత మళ్లీ రాదని అనుకోవద్దని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న తొమ్మిది మంది పోలీసులు కరోనాను జయించి శనివారం  విధులకు హాజరయ్యారు.

డీఎస్పీ కార్యాలయంలో ఐదుగురు విధుల్లోకి...

ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రాగా శుక్రవారం నాటికి హోం ఐసొలేషన్‌ పూర్తికావడంతో శనివారం విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మందులు మాత్రమే ఉపయోగించామని, ప్రతి రోజూ వ్యాయా మం, విటమిన్లు, పౌష్టికాహారం తీసుకోవడంతో కరోనాను జయించామని పోలీసులు తెలిపారు. 


logo