సోమవారం 26 అక్టోబర్ 2020
Kamareddy - Aug 07, 2020 , 03:52:48

ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పార్టీ కార్యాలయాలు

ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పార్టీ కార్యాలయాలు

  • n నిజామాబాద్‌లో అన్ని హంగులతో మినీ తెలంగాణ భవన్‌ 
  • n త్వరలో  సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం 
  • n టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుల ఉమ

ఖలీల్‌వాడి : ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుల ఉమ అన్నారు. నిజామాబాద్‌ నగరం లో నిర్మిస్తున్న మినీ తెలంగాణ భవన్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి స మస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందు కు పార్టీ కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామ ని చెప్పారు. ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో, వారి మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలనే సంకల్పంతో జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయని తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ కార్యాలయం అన్ని హంగులతో సిద్ధం అయ్యిందని, త్వరలో ప్రారంభోత్సవం ఉం టుందని చెప్పారు. సీఎం మానసపుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నదని, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని తెలిపారు. 


logo