ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 05, 2020 , 01:58:56

మురిసిన ఉద్యమగడ్డ!

మురిసిన ఉద్యమగడ్డ!

  • nమోతెకు చేరిన మాటు కాలువ నీళ్లు
  • nఆనందంలో గ్రామస్తులు
  • nసీఎం కేసీఆర్‌, మంత్రి వేముల చిత్రపటాలకు జలాభిషేకం

వేల్పూర్‌: ఉద్యమగడ్డ మోతె మురిసిపోయింది. కొన్నేండ్లుగా గ్రామస్తులు సాగునీటి సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. మాటు కాలువ ద్వారా గ్రామంలోని పెద్ద చెరువుకు నీళ్లు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ గ్రామ శివారు నుంచి మోతె గ్రామంలోని పెద్ద చెరువు వరకు మాటు కాలువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.3.80 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పనులు ఇటీవల పూర్తికాగా మంగళవారం కాలువ ద్వారా నీళ్లు మోతె గ్రామంలోని పెద్ద చెరువుకు చేరాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకొని పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నుంచి ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని కేసీఆర్‌ దత్తత తీసుకోగా, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయన్నారు. వారికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యు లు, ఎంపీటీసీలు సత్తెమ్మ, రాజేశ్వర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పాలెపు బాలరాజు, ఉప సర్పంచ్‌ రాజేశ్‌, రాజరెడ్డి , పాలెపు నర్సయ్య, దోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, రాజరెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo