శనివారం 08 ఆగస్టు 2020
Kamareddy - Aug 02, 2020 , 00:56:12

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

లింగంపేట(తాడ్వాయి) : తాడ్వాయి మండలంలో శనివారం నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఎర్రాపహాడ్‌ ప్రాథమిక ఆరో గ్య కేంద్రం వైద్యుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు. తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో ఒకరికి, కృష్ణాజివాడిలో ఒకరికి, చిట్యాలలో ఒకరికి, బస్వన్నపల్లి గ్రామంలో ఒకరికి కరోనా సోకిందని ఆయన తెలిపారు. 

బొల్లక్‌పల్లిలో ఒకరికి.. 

పిట్లం : మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి శివకుమార్‌ శనివారం తెలిపారు. సర్పంచ్‌ సావిత్రి ఆధ్వర్యంలో సదరు వ్యక్తి నివసించే ఇంటి పరిసరాల్లో క్లోరినేషన్‌ చేయించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని, మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి శివాజీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు రవీందర్‌, వార్డు సభ్యులు ఉన్నారు. 

నస్రుల్లాబాద్‌లో ఐదుగురికి.. 

నస్రుల్లాబాద్‌ : మండల కేంద్రంలో ఇద్దరికి, దుర్కిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవిరాజా శనివారం తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు మొత్తం 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

కోటగిరిలో నలుగురికి.. 

కోటగిరి : మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఏడుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ముగ్గురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇందులో ఒకరు కోటగిరి వాసి కాగా.. ఇద్దరు బోధన్‌కు చెందిన వారు అని తెలిపారు. పొతంగల్‌ పీహెచ్‌సీలో నలుగురికి టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని, అతడు బోధన్‌ వాసి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉం డాలని డాక్టర్‌ సమత సూచించారు. 

గండివేట్‌లో ఒకరికి..

గాంధారి : మండలంలోని గండివేట్‌ గ్రామం లో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి హరికృష్ణ శనివారం తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు మొత్తం 19 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. గోరువెచ్చని నీరు తాగాలని, పౌ ష్టికాహారం తీసుకోవాలని ఆయన సూచించారు. 

ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఆరుగురికి..

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ బల్దియా పరిధిలో ఆరు కరో నా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌, పట్టణ వైద్యాధికారిణి అయేషా ఫిర్దోస్‌ శనివారం తెలిపారు. కోటార్మూర్‌కు చెందిన 35 ఏండ్ల యువకుడికి, పెర్కిట్‌లో 28 ఏండ్ల యువకుడికి, ఆర్మూర్‌ బల్దియాలో 28 ఏండ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. పట్టణంలోని హుస్నాబాద్‌కు చెందిన 48 ఏండ్ల మహిళకు, జర్నలిస్టు కాలనీలో 78 ఏండ్ల వృద్ధుడికి, జిరాయత్‌నగర్‌లో 58 ఏం డ్ల వృద్ధుడికి కరోనా సోకిందని చెప్పారు. వీరందరికీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామ ని వైద్యులు తెలిపారు. 

బోధన్‌లో ఒకరికి.. 

శక్కర్‌నగర్‌ : బోధన్‌ పట్టణంలోని పాన్‌గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖాన, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. 


logo